చంద్రబాబు నివాసంలోని సీతారాముల విగ్రహాల ప్రత్యేకత ఇదే!
- నిన్న హైదరాబాదులో పర్యటించిన ప్రధాని మోదీ
- ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి రాక
- చంద్రబాబు నివాసంలోని సీతారాముల విగ్రహాలకు పూజలు
- ఆ విగ్రహాలు తన మామ ఎన్టీఆర్ ఇచ్చారని వెల్లడించిన చంద్రబాబు
- పైగా అవి పంచలోహాలతో తయారైన విగ్రహాలని వివరణ
ప్రధాని నరేంద్ర మోదీ నిన్న హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాన్ని సందర్శించడం తెలిసిందే. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. చంద్రబాబు నివాసంలోని పూజామందిరంలో ఉన్న సీతారాముల విగ్రహాలను చూసిన ప్రధాని మోదీ, భక్తిపారవశ్యంతో వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ క్రమంలో ఆ విగ్రహాల విశిష్ఠతను చంద్రబాబు ప్రధానికి వివరించారు. దశాబ్దాల క్రితం నాటి ఆ విగ్రహాలను తన మామగారైన స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) తమకు ఇచ్చారని తెలిపారు. ఎన్టీఆర్ జ్ఞాపకంగా వాటిని భద్రపరుచుకుని పూజలు చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. పైగా అవి పంచలోహాలతో తయారైన విగ్రహాలని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ ఆసక్తి కనబరిచారు.